Wednesday, October 9, 2024

భారత్ హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

చైనా వేదికగా జరుగుతున్న పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. బుధవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 81 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది.

రాజ్‌కుమార్ పాల్ మూడు గోల్స్ సాధించి జట్ట విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాజ్‌కుమార్ (3వ, 25వ, 33వ) నిమిషంలో గోల్స్ సాధించాడు. అరైజీత్ సింగ్ హుందాయ్ 6, 39వ నిమిషంలో గోల్స్ చేశాడు. జుగ్ రాజ్, హర్మన్‌ప్రీత్, ఉత్తమ్ సింగ్‌లు చెరో గోల్ సాధించి జట్టు గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. మలేసియా తరఫున ఏకైక గోల్‌ను అనౌల్ అఖిముల్లా సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News