Thursday, October 10, 2024

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి

- Advertisement -
- Advertisement -

గాంధీ ఆస్పత్రి లో జూనియర్ డాక్టర్ మీద దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి చిలకలగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం. మానసిక పరిస్థితి బాగాలేని ప్రకాష్ (60) అనే వ్యక్తి, ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ జూనియర్ వైద్యురాలిపై దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా సదరు వ్యక్తికి మూర్చ వ్యాధి ఉన్నట్టు, దాడి చేసిన సమయంలో మద్యం కూడా సేవించి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు.

గాంధీ ఆసుపత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో మద్యం మత్తులో ఉన్న రోగి మహిళా డాక్టర్‌పై దాడి చేయడం దుర్మార్గమని జూడాలు అన్నారు. గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఈ ఘటనపై ఫిర్యాదు చేశామని వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News