Thursday, March 28, 2024

ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమే

- Advertisement -
- Advertisement -

India-vs-Australia

మన తెలంగాణ/క్రీడా విభాగం : కొంతకాలంగా వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు తొలి సారి అసలైన పరీక్ష ఎదురు కానుంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ భారత్‌కు అసలైన సవాలుగా మారింది. ఇప్పటి వరకు పలు సిరీస్‌లు గెలిచినా ఆస్ట్రేలియాను ఓడించడం మాత్రం అనుకున్నంత తేలికకాదు. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమనే చెప్పాలి. అయితే ఆస్ట్రేలియాకు భారత్‌పై మెరుగైన రికార్డు ఉన్న విషయం తెలిసిందే. భారత గడ్డపై కూడా ఆస్ట్రేలియా పలుసార్లు సిరీస్‌లను సొంతం చేసుకుంది. కిందటిసారి జరిగిన సిరీస్ కూడా కంగారూలకే దక్కింది.

కానీ, ఇటీవల కాలంలో టీమిండియా చాలా బలోపేతంగా తయారైంది. ఫార్మాట్ ఏదైన విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. ఇంటాబయటా అనే తేడా లేకుండా వరుస సిరీస్‌లను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే దక్షిణాఫ్రికాను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించింది. అంతేగాక విండీస్‌ను వారి దేశంలోనే చిత్తు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియానే విజేతగా నిలిచింది. ఇన్ని విజయాలు సాధించినా ఆస్ట్రేలియాను ఓడించడం మాత్రం భారత్‌కు సవాలు వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు జట్ల మధ్య ఎప్పుడూ సిరీస్ జరిగినా అది నువ్వానేనా అన్నట్టు సాగడం పరిపాటిగా తయారైంది.

ప్రతి మ్యాచ్ కూడా చివరి వరకు ఆసక్తికరంగా సాగడం సిరీస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సీనియర్ క్రికెటర్లు వార్నర్, స్టీవ్ స్మిత్‌ల చేరికతో ఆస్ట్రేలియా మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఫార్మాట్ ఏదైనా విజయం సాధించడం ఆస్ట్రేలియాకు అలవాటుగా మారింది. జట్టు ప్రదర్శన చూస్తుంటే మునుపటి జట్టును తలపిస్తోంది. ఇటీవల జరిగిన అన్ని సిరీస్‌లలో కూడా కంగారూలు అజేయంగా నిలిచారు. న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక తదితర జట్లతో జరిగిన సిరీస్‌లలో ఆస్ట్రేలియా ఏకపక్ష విజయాలు సాధించింది. కానీ, భారత్‌తో జరిగే సిరీస్ మాత్రం కంగారూలకు కూడా అంత తేలిక కాదని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి.

కాగా, ఆతిథ్య భారత జట్టు మాత్రం ఈ సిరీస్‌ను ప్రతిష్టాతక్మకంగా తీసుకుంది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించడం ద్వారా రానున్న న్యూజిలాండ్ పర్యటనకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని తహతహలాడుతోంది. శ్రీలంకతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా జోరుమీద కనిపిస్తోంది. ఇదే సంప్రదాయాన్ని ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ మాత్రం భారత్‌కు ఒక సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. సమష్టిగా రాణిస్తే తప్ప ఇందులో విజయం సాధించడం కష్టమే. ఇక, ఇందులో టీమిండియా ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.

India vs Australia 2020 ODI Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News