Tuesday, April 30, 2024

ఎదురులేని రోహిత్ సేన

- Advertisement -
- Advertisement -

ఎదురులేని రోహిత్ సేన
చెలరేగిన ప్రసిద్ద్, రాణించిన రాహుల్, సూర్యకుమార్

రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం, సిరీస్ కైవసం

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. విండీస్‌పై ఇది టీమిండియాకు రికార్డు స్థాయిలో 11వ సిరీస్ విజయం కావడం విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 46 ఓవర్లలో కేవలం 193 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు షాయ్ హోప్, బ్రాండన్ కింగ్ శుభారంభం అందించారు.
ప్రసిద్ధ్ మాయ..
అయితే సాఫీగా సాగుతున్న విండీస్ ఇన్నింగ్స్‌ను యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దెబ్బతీశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన కింగ్‌ను ప్రసిద్ధ్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే డారెన్ బ్రావోను కూడా ప్రసిద్ధ్ ఔట్ చేశాడు. మరోవైపు కుదురుగా ఆడుతున్న ఓపెనర్ షాయ్ హోప్ (27)ను చాహల్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ నికోలస్ పూరన్ (9) కూడా నిరాశ పరిచాడు. ఈ వికెట్ కూడా ప్రసిద్ధ్‌కే దక్కింది. జేసన్ హోల్డర్(2) కూడా విఫలమయ్యాడు. చివర్లో అకిల్ హుస్సన్ (34), ఫబియాన్ అలెన్ (13), ఒడియన్ స్మిత్ (24) కాస్త పోరాడినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. ప్రసిద్ధ్ 12 పరుగులకే 4 వికెట్లు పడగొటట్టాడు. శార్దూల్, సిరాజ్, చాహల్‌లు కూడా మెరుగైన బౌలింగ్‌తో తమవంతు పాత్ర పోషించారు.
ఆదుకున్న రాహుల్, సూర్య
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రిషబ్ పంత్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (18) కూడా నిరాశ పరిచాడు. అయితే ఈ దశలో కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తమపై వేసుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ ఐదు ఫోర్లతో 64 పరుగులు చేశాడు. ధాటిగా బ్యాటింగ్ చేసిన రాహుల్ 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 49 పరుగులు సాధించాడు. మిగతావారిలో వాషింగ్టన్ సుందర్ (24), దీపక్ హుడా (29) మాత్రమే రాణించారు. చివర్లో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత్ స్కోరు 237 పరుగులకే పరిమితమైంది.

India won by 44 runs against WI in 2nd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News