Tuesday, April 16, 2024

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Two Youth killed in Road Accident in Kamareddy

కామారెడ్డి: జిల్లాలోని రాజంపేటలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం రాజంపేట శివారులోని బోరెగడ్డ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ మోటర్ సైకిల్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Two Youth killed in Road Accident in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News