కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సోమవారం నాలుగో రోజు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 పరుగులను సాధించిన జట్టుగా భారత్ రికార్డును నెలకొల్పింది. టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు 18 బంతుల్లోనే 50 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఇక అంతేగాక ఇదే మ్యాచ్‌లో భారత్ మరో రికార్డును కూడా అందుకుంది.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ పేరిట ఉన్న 89 సిక్సర్లు రికార్డును భారత్ బద్దలు కొట్టింది. భారత్ 90 సిక్సర్లతో నయా రికార్డు నెలకొల్పింది. మరోవైపు టెస్టు క్రికెట్‌లో వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. భారత్ ఈ రికార్డులన్నీ ఒకే మ్యాచ్‌లో ఒకే రోజు సాధించడం విశేషం.