- Advertisement -
భారతీయ రెండో వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆక్సిమ్- 4 మిషన్ ప్రయోగం బుధవారం నాడు ఐదోసారి వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) పంపాల్సిన మిషన్ కోసం ఉపయోగించనున్నఫాల్కన్ 9 రాకెట్ లో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. రాకెట్ లో లోపాన్ని సవరించే కార్యక్రమం సాగుతోందని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో స్పేస్ ఎక్స్ పేర్కొంది. అయితే, ప్రయోగానికి కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు.ఫాల్కాన్ -9 ఆక్సిమ్ -4 ప్రయోగానికి ముందు పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ తనిఖీలలో ఎల్‌ఓఎక్స్ లీక్ ను గుర్తించారు. ఎల్ ఓఎక్స్ లీక్ అనేది ఆక్సిజన్ లీక్ ను సూచిస్తుంది. ఆ లీక్ నివారించేందుకు తగిన మరమ్మతులు పూర్తి చేసేందుకు మరికొంతవ్యవధి అవసరం. అది పూర్తయిన తర్వాత కొత్త ప్రయోగ తేదీని ప్రకటించనున్నట్లు స్పెస్ ఎక్స్
పేర్కొంది.
- Advertisement -