Saturday, December 7, 2024

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తే సరికి నేడు భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గత రెండు రోజుల ఊపుకు బ్రేక్ పడింది. అమెరికాలో ట్రంప్ గెలిచాక నిఫ్టీ 302 పాయింట్లు, సెన్సెక్స్ 959 పాయింట్లు పతనం అయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 836.34 పాయింట్లు లేక 1.04 శాతం పతనమై 79541.79వద్ద ముగిసింది. నిఫ్టీ 284.70 పాయింట్లు లేక 1.16 శాతం పతనమై 24199.30 వద్ద ముగిసింది. నేడు నిఫ్టీలో 4 షేర్లు లాభపడగా, 46 షేర్లు నష్టపోయాయి.  ప్రధానంగా లాభపడిన షేర్లలో అపోలోహాస్పిటల్స్, ఎస్ బిఐఎన్, హెచ్ డిఎఫ్ సి లైఫ్, టిసిఎస్ ఉండగా, ప్రధానంగా నష్టపోయిన షేర్లలో హిందాల్కో, ట్రెంట్, గ్రాసిం, శ్రీరామఫైనాన్స్, అదానీఎంటర్ ప్రైజెస్ ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News