Monday, December 2, 2024

బెంగాల్ నుంచి కేసు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్ జి కర్ హత్యాచారం కేసు విచారణను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.పశ్చిమ బెంగాల్ నుంచి విచారణను బదిలీ చేయాలని మౌఖికంగా చేసుకున్న వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ బదిలీ చేయడం కుదరదని మౌఖికంగానే తెలిపింది.

కేసు విచారణ సందర్భంగా రాష్ట్రంలో అలజడి వాతావరణం ఉందని, అందుకే బదిలీ చేయాలని ఓ వకీలు కోరారు. అప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి ప్రతిస్పందించి ‘‘మణిపుర్ కేసుల వంటి విషయాల్లో అలాగే చేశాము. కానీ ఇప్పుడు అలా చేయబోవడం లేదు. ఎలాంటి బదిలీ ఉండదు’’ అని స్పష్టం చేశారు. అప్పుడు వకీలు ‘‘బెంగాల్ ప్రజలకు న్యాయవ్యవస్థ, పోలీసుల మీద నమ్మకం పోయింది’’ అన్నారు. దానికి ప్రధాన న్యాయమూర్తి ‘‘ప్రజల గురించి మాట్లాడకండి…ఎవరి కోసం మీరు అప్పీరయ్యారు? మీరు ఇలాంటి జనరల్ స్టేట్ మెంట్లు ఇవ్వకూడదు. కోర్టులో క్యాంటీన్ గ్యాసిప్స్ చోటుచేసుకుంటున్నాయి’’ అన్నారు. మరో లాయరు సిబిఐ సరిగా పరిశోధన జరపలేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News