ఈ నెల 8,9 తేదీ రాత్రి భారత్‌పై గగనతల దాడికి పాకిస్థాన్ ప్రయత్నించింది. డ్రోన్లు, మానవ రహిత విమానాలు మనవైపు దూసుకువచ్చాయి. వాటినన్నిటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పౌరులపై దాడులను అడ్డుకున్నాం. డ్రోన్ దాడులకు ప్రతిగా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై దాడులు చేశాం. మొత్తంగా మూడు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో 35నుంచి 40 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నాం’ అని డిజిఎంఒ పేర్కొన్నారు.
భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాక్‌కు సైన్యం స్పష్టమైన సందేశం ఇచ్చింది. పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియజేశాం.సైన్యం, వాయుసేన చర్యలకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకాదళం సర్వ సన్నద్ధంగా ఉంది. కశ్మీర్‌నుంచి గుజరాత్ వరకు సరిహద్దు నగరాలపై డ్రోన్ దాడులకు పాక్ ప్రయత్నించింది. గుంపులు, గుంపులుగా డ్రోన్లతో దాడులకు యత్నించిందని త్రివిధ దళ అధికారులు వెల్లడించారు.