Saturday, July 27, 2024

5జి ట్రయల్స్‌కు అనుమతి

- Advertisement -
- Advertisement -
Huawei
భారత ప్రభుత్వానికి హువాయి కృతజ్ఞతలు

న్యూఢిల్లీ: 5జి నెట్‌వర్క్ ట్రయల్స్‌లో భాగస్వామ్యం కల్పించినందుకు గాను చైనా టెలికమ్యూనికేషన్ దిగ్గజం హువాయి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. భారత్ టెలికామ్ రంగంలో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలు, అత్యున్నత నాణ్యత నెట్‌వర్క్‌ను అందిస్తామని, భారత్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. సూపర్‌ఫాస్ట్ స్పీడ్ 5జి నెట్‌వర్క్ ట్రయల్స్ నిర్వహించేందుకు అన్ని టెలికాం సేవల సంస్థలకు ప్రసారాలను కేటాయించామని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఎరిక్సన్ వంటి పాశ్చాత్య పరికరాల తయారీ సంస్థలకు పోటీగా ఉన్న హువాయిని అమెరికాలో నిషేధించారు.

‘జాతీయ భద్రత’ ముప్పు ఉందంటూ అమెరికా ఈ సంస్థ వ్యాపారాన్ని నిషేధించిన నేపథ్యంలో భారతదేశం తీసుకున్న నిర్ణయం కంపెనీకి పెద్ద ఉపశమనం కలిగించింది. చైనా కంపెనీతో సంబంధాలు పెట్టుకోవద్దని అమెరికా తన స్నేహపూర్వక దేశాలపై ఒత్తిడి కూడా తెచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. హై-స్పీడ్ 5 జి నెట్‌వర్క్‌ల పరీక్ష కోసం అన్ని టెలికాం కంపెనీలకు స్పెక్ట్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం తెలిపారు.

ఈ ట్రయల్స్ కోసం టెలికాం కంపెనీల్లో చైనా కంపెనీతో సహా ప్రపంచంలోని ప్రముఖ నెట్‌వర్క్ పరికరాల సంస్థతో భాగస్వామ్యం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అంతర్జాతీయ మీడియా వ్యవహారాల సీనియర్ మేనేజర్ సిరిల్ షు మాట్లాడుతూ, 5జి ట్రయల్స్‌లో పాల్గొనేందుకు హువావేకు భారత్ అవకాశమిచ్చిందని, తమ సంస్థపై నమ్మకాన్ని కొనసాగించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని అన్నారు.

 

 

Indian Government Permission for 5G Trials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News