Wednesday, September 18, 2024

వాణిజ్య నౌకలపై దాడులపై కదలిక

- Advertisement -
- Advertisement -

అరేబియా సముద్రంలో భారత నౌకాదళ సంసిద్ధత

న్యూఢిల్లీ : అరేబియా మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ జలాల్లో భారత నౌకాదళం తమ నిఘాను మరింత తీవ్రతరం చేసింది. ఈ మార్గాలలో ఇటీవలి కాలంలో తరచూ వాణిజ్య నౌకలపై దాడులు, విధ్వంసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడికి భారతీయ క్షేత్రస్థాయి విధ్వంసక ఆయుధాలు, యుద్ధ నౌకలను రంగంలోకి దింపారు. డిసెంబర్ 23వ తేదీన భారత పశ్చిమ తీరం వెంబడి డ్రోన్ దాడి జరిగింది.

లైబిరియా నుంచి బయలుదేరిన సరుకుల నౌక ఎంవి ఛెం ప్లూటో లక్షంగా ధ్వంసానికి పాల్పడ్డారు. ఇందులో 21 మంది భారతీయ సిబ్బంది కూడా ఉంది. ఈ ఘటనకు ఇరాన్ మద్దతుగల హౌతీ మిలిటెంట్లు కారణం అని వెల్లడైంది. పలు వాణిజ్య నౌకలపై ఈ వర్గం దొంగదెబ్బలకు దిగుతోంది. భారత్‌కు వస్తున్న మరో వాణిజ్య ముడిచమురు నౌక ఎంవి సాయిబాబాపై ఇదేరోజు ఎర్రసముద్రంలో దాడి జరిగింది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని భారతీయ నౌకాదళం మరింత అప్రమత్తం అయిందని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News