Saturday, May 11, 2024

గిలానీ తెహ్రీక్ సంస్థపై నిషేధం

- Advertisement -
- Advertisement -

వేర్పాటువాదుల ఆటకట్టే: అమిత్‌షా

న్యూఢిల్లీ : పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీక్ ఏ హరియత్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సంస్థకు గతంలో దివంగత కరడుగట్టిన వేర్పాటువాది సయ్యద్ అలీ షా గిలానీ సారధ్యం వహించారు. వచ్చే ఐదేళ్ల పాటు ఈ తెహ్రీక్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్రం ఆదివారం తమ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సంస్థ తరచూ తన కార్యకలాపాలతో జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో వేర్పాటువాదాన్ని, పాకిస్థాన్ అనుకూల ప్రచారం ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నదనే అంశం పరిగణనలోకి తీసుకున్నారు.

ఇప్పుడు నిషేధం విధింపు విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం జాడ నిలువనీడ లేకుండా చేయడమే ప్రధాని మోడీ సారధ్యంలోని తమ ప్రభుత్వ ఆలోచన అని షా తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను, వ్యక్తులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు తెహ్రీక్ ఏ హరియత్ , జెకె (టెహ్)పై నిషేధానికి దిగుతున్నట్లు, ఇక ఈ సంస్థ ఎటువంటి వేర్పాటువాద చర్యలకు దిగడానికి వీల్లేదు.

జమ్మూ కశ్మీర్‌ను ఇండియా నుంచి విడదీయాలనే సంకల్పానికి అడ్డుకట్ట వేస్తున్నామని హోం మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం పరిధిలో ఈ చర్యకు దిగారు. గతంలో ఈ సంస్థకు గిలానీ సారధ్యం ఉండేది. తరువాతి క్రమంలో దీనికి మసరత్ ఆలం భట్ నేతగా మారారు. ప్రస్తుతం భట్ జైలులో ఉన్నారు. ఆయన జమ్మూ కశ్మీర్ ముస్లింలీగ్ సంస్థకు కూడా అధినేతగా ఉన్నారు. దీనిపై కూడా ఈ డిసెంబర్‌లోనే వేటు పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News