Saturday, July 27, 2024

ముగిసిన కెసిఆర్ బస్సుయాత్ర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభతో ముగిసింది. గతనెల 24న మిర్యాలగూడలో ప్రారంభమైన కెసిఆర్ బస్సుయాత్ర, రోడ్ షో అప్రతిహతంగా కొనసాగింది. కెసిఆర్ బస్సుయాత్ర నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల విధించిన నిషేధం విషయం తెలిసిందే. ఇసి విధించిన నిషేదం ముగిసిన తర్వాత కెసిఆర్ తిరిగి రామగుండం నుంచి తన బస్సుయాత్రను కొనసాగించారు. బస్సుయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం సిరిసిల్ల రోడ్ షో నిర్వహించి అనంతరం సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కెసిఆర్ బస్సు యాత్ర కొనసాగింది. కెసిఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తన ప్రసంగంలో కెసిఆర్ ప్రస్తావించే అంశాలు ప్రజలను ఆలోచింపజేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఆవశ్యకతను, కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను గులాబీ బాస్ తన బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News