Tuesday, March 19, 2024

ఒడిశా రైలు ప్రమాదంలో 278కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానాగ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన మూడు రైళ్ల సబంధిత ప్రమాదంలో మృతుల సంఖ్య 278 కు చేరింది. ఈ ఘటనలో 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారికి వివిధ ఆసుపత్రుల్లో రైల్వే శాఖ చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత 43 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది.బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టా లు తప్పింది.

హౌరా నుంచి చెన్నైకు వెళ్లుతున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. వేర్వేరు ట్రాక్‌లపై కొద్ది గంటల వ్యవధిలోనే ఈ మూడు యాక్సిడెంట్లు జరిగాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 12864 నెంబరు బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరాకు వెళ్లుతుండగా పట్టాలు తప్పి బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. ఈ బోగీలను అటుగా వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఈ దశలోనే ఈ రూట్లో వస్తున్న గూడ్స్ రైలు పట్టాలపై పడి ఉన్న బోగీలను ఢీకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News