Tuesday, September 17, 2024

టిటి క్వార్టర్ ఫైనల్లో భారత్.. చరిత్ర సృష్టించిన మహిళా టీమ్

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్ టెబుల్ టెన్నిస్ పోటీల్లో భారత మహిళా జట్టు నయా చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల టీమ్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్ 32 తేడాతో రొమేనియాపై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కింది. ఒలింపిక్స్‌లో భారత మహిళల టిటి జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌లతో కూడిన భారత త్రయం చారిత్రక విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత డబుల్స్‌లో శ్రీజ, అర్చనా కామత్ జోడీ అద్భుత ఆటతో జయకేతనం ఎగుర వేసింది. డయాకోసమర ఎలిజబెటా జోడీతో జరిగిన పోరులో శ్రీజ జంట 119, 1210, 117 తేడాతో జయభేరి మోగించింది. తర్వాత జరిగిన మొదటి సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి మనికా బాత్రా దూకుడైన ఆటతో చెలరేగి పోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో మనిక బాత్రా 115, 117, 117 తేడాతో రొమేనియా క్రీడాకారిణి బెర్నాడెట్టేను ఓడించింది.

అయితే తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో రొమేనియా పైచేయి సాధించింది. రెండో సింగిల్స్‌లో శ్‌రీజ పోరాడి ఓడింది. ఎలిజబెటాతో జరిగిన పోరులో శ్రీజ 118,411, 117, 611, 811 తేడాతో ఓటమి పాలైంది. మూడో సింగిల్స్‌లో అర్చనా కామత్ కూడా పరాజయం చవిచూసింది. బెర్నాడెట్టేతో జరిగిన పోరులో అర్చనా ఓటమి పాలైంది. అయితే ఫలితాన్ని తేల్చే ఐదో గేమ్‌లో మనికా బాత్రా అసాధారణ ఆటతో అలరించింది. డయాకోనుతో జరిగిన కీలక పోరులో మనికా బాత్ర అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News