Thursday, April 25, 2024

16 నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత నిరుద్యోగ రేటు డిసెంబర్ 2022 నాటికి 8.30 శాతానికి చేరింది. ఇది అంతకు ముందు నెల 8.00 శాతంగా ఉండింది. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి(సిఎంఐఈ) డేటా ఆదివారం పేర్కొంది. ఇక పట్టణ నిరుద్యోగం 8.96 శాతం నుంచి పెరిగి డిసెంబర్ నాటికి 10.09 శాతం అయింది. కాగా గ్రామీణ నిరుద్యోగ రేటు 7.55 నుంచి 7.44 శాతానికి తగ్గిందని డేటా తెలిపింది.

‘నిరుద్యోగ రేటు అంత అధ్వానంగా ఏమిలేదు’ అని సిఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ తెలిపారు. లేబర్ పార్టిసిపేషన్ రేటు డిసెంబర్‌లో 40.48 శాతానికి పెరిగింది. 12 నెలలో ఇదే గరిష్ఠం. “ఉద్యోగ రేటు డిసెంబర్ నాటికి 37.1 శాతం పెరిగింది’ అని ఆయన రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడం, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓ సవాలుగా ఉంది. డిసెంబర్‌లో హర్యానా నిరుద్యోగిత రేటు 37.4 శాతానికి, రాజస్థాన్‌లో 28.5 శాతానికి, ఢిల్లీలో 20.8 శాతానికి పెరిగిందని సిఎంఐ డేటా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News