Friday, September 13, 2024

టూర్లతో రిలాక్స్

- Advertisement -
- Advertisement -

అందాల తార కీర్తి సురేష్ ఈ మధ్యన రకరకాల ప్రదేశాలకు టూర్లకు వెళ్లి రిలాక్స్ అవుతోంది. ఆ మధ్య దక్షిణ తమిళనాడు తిరిగింది. ఇప్పుడు థాయిలాండ్‌లో ల్యాండ్ అయింది. కీర్తి సురేష్ ప్రస్తుతం థాయిలాండ్‌లోని కో సముయ్ అనే దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.

అక్కడే కొత్త ఏడాది వేడుకలను జరుపుకుంటోంది. క్రిస్మస్‌కి ముందు రోజు అక్కడ ల్యాండ్ అయింది. జనవరి మొదటి వారంలో ఇండియాకి వస్తుందట. ఆమె నటిస్తున్న ‘దసరా’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇక చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతుంది. అందుకే ఆమె టూర్లతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News