Friday, March 29, 2024

జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు 2023 24 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలో మొత్తం 221 పని దినాలలో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం తరగతులు మొదలవుతాయి. అక్టోబరు 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది.

2023 నవంబర్ 20 నుంచి 25 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది. 2024 జనవరి 22 నుంచి 29 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి రెండో వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి 31 చివరి పనిదినం అని ఇంటర్ బోర్డు వెల్లడించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమలవుతాయని తెలిపింది. 2024 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీన జూనియర్ కాలేజీలు పునః ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్

2023 జూన్ 1 నుంచి ఇంటర్మీడియేట్ తరగతులు ప్రారంభం
2023 అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు
2023 నవంబర్ 20 నుంచి 25 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు
2024 జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు
2024 జనవరి 22 నుంచి 29 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు
2024 ఫిబ్రవరి రెండో వారంలో ప్రాక్టికల్ పరీక్షలు
2024 మార్చి మొదటి వారంలో ఇంటర్ వార్షిక పరీక్షలు
2024 మార్చి 31 చివరి పనిదినం
2024 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
2024 మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
2024 జూన్ 1న జూనియర్ కాలేజీల పునః ప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News