Sunday, June 16, 2024

ఆర్‌కె బీచ్‌లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్ష, రాజ్ కుమార్ అనే ఇంటర్ విద్యార్థులు ఉదయం బీచ్‌కు వచ్చారు. వారు బీచ్‌లో ఈతకొడుతుండగా సముద్రపు అలలకు కొట్టుకపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గత ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో నుంచి హర్ష మృతదేహాన్ని బయటకు తీయగా రాజ్‌కుమార్ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అలలు ఎగసిపడుతున్న సమయంలో సముద్రం లోపలికి వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: 75 ఏళ్ల తర్వాత కశ్మీరులో శారదా దేవికి శరన్నవ రాత్రి పూజలు(వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News