Saturday, April 27, 2024

కలల కథలు

- Advertisement -
- Advertisement -

Dreams

కలలు మన ఆలోచనలకు ప్రతిబింబాలు. మెదడు లోతుల్లోని భావాలను విప్పి చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందరికి కలలు వస్తుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంటాయి. అయితే వచ్చిన కలలకు అర్థం తెలీక చాలామంది అపోహలు పడుతుంటారు. ఇలా వచ్చిందేంటి అని భయపడిపోతుంటారు. అలాంటి వారి కోసమే ఈ కలలకు అర్థాలు…

* ఎత్తు నుంచి పడిపోవటం : ఎత్తు నుండి పడిపోతున్నట్టు కల వస్తే, ఏ విషయం మీదో పట్టు సాధించాలనే మీ ప్రయత్నానికి సూచన.

* గాల్లో ఎగరటం : ఆకాశంలో ఎగురుతున్నట్టు కల వస్తే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని, లేదా జీవితంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థం.

* నగ్నంగా : మీలోని భయానికి, అభద్రతా భావానికి సూచన.

*చనిపోయినట్టు: చనిపోయినట్టు కల వస్తే, నిజంగానే చనిపో తామని అర్థం కాదు. మీ జీవితంలో ఒక అంకం లేదా ఒక బంధం ముగిసిపోతున్నందుకు సూచనే ఈ కల.

*ఎవరో తరుముతున్నట్టు : జీవితంలో ఎదురయ్యే కష్టాలు, లేదా సమస్యల గురించి భయపడుతూ ఉంటే ఇలాంటి కలలొస్తాయి. ఆ భయాల్ని, సమస్యల్ని ఎదురించటం కోసం వెంటనే సిద్ధం కండి.

* మంటలు : రగిలే మంటలు కలలోకొస్తే ఏదో మార్పు జరగబోతోందని అర్థం.

* గర్భం దాల్చినట్టు : ఇది గొప్ప ఎదుగుదలకు, మార్పునకు సూచన.

* డబ్బు : మన మనస్తత్వంలోని లోపాలకు ప్రతిబింబాలే డబ్బులు.

* అక్రమ సంబంధం: మీలో అణగదొక్కిన లైంగిక వాంఛలు, జీవిత భాగస్వామితో ఆనందంగా లేకపోవటం, స్వీయ విలువ తగ్గినట్టు భావించటం ఈ కలలకు కారణాలు.

* నీళ్లు : నీళ్లు శుభ్రతకూ, కల్మషాలు, మలినాలు తొలగిపోవటానికీ సూచన.

Interesting Facts About Dreams

Interesting Facts About Dreams

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News