Saturday, April 20, 2024

ఇంత బలమైన క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు

- Advertisement -
- Advertisement -

 Mehreen

 

నందమూరి కల్యాణ్‌రామ్ టైటిల్ పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రై.లి. పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహ్రీన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అన్ని రకాల ఎమోషన్స్‌తో…
‘ఎఫ్ 2’లో నేను చేసిన హాని క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. అలాగే ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉంటుంది. ఈ పాత్ర అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నేను ఓ నిర్మాతగా కూడా నటించాను.

అందరినీ ఆకట్టుకుంటుంది…
సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అలాగే యాక్షన్, కమర్షియల్ అంశాలు కూడా హైలైట్‌గా ఉంటాయి. ట్రైలర్‌లో ఎమోషన్స్, యాక్షన్‌తో పాటు కామెడీ యాంగిల్ కూడా బాగా హైలైట్ అయింది. సినిమా కూడా అలాగే ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటుంది.

ఎంతగానో ప్రోత్సహించారు…
‘ఎంత మంచివాడవురా’ అనే టైటిల్ ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. చాలా సింపుల్ గా ఉంటారు. ‘నువ్వు మంచి నటివి’ అని ఆయన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కళ్యాణ్ రామ్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయా…
‘ఎఫ్ 2’లో హాని క్యారెక్టర్‌కు నేనే డబ్బింగ్ చెప్పాను. అయితే ఈ సినిమా కోసం కూడా నేను డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను. కానీ ఇందులో కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. నాకు తెలుగు పూర్తిగా రాకపోవడంతో ఆ పదాలను సరిగ్గా పలకలేకపోయాను. అందుకే డబ్బింగ్ వేరే వాళ్ల చేత చెప్పించాము. అది చాలా ప్లస్ అయింది.

వారి నమ్మకాన్ని నిలబెట్టానని…
దర్శకుడు సతీశ్ వేగేశ్న నాకు మొదట కథ చెప్పినప్పుడే నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే నా కెరీర్‌లో ఇంత బలమైన క్యారెక్టర్‌ను ఎప్పుడూ చేయలేదు. అదే విషయం గురించి నేను డైరెక్టర్‌ని అడిగాను. ‘నువ్వు చేయగలవనే నమ్మకం మాకు ఉంది’అని ఆయన అన్నారు. నేను వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను.

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా…
ఈ నెలలోనే నేను నటించిన ఎంత మంచివాడవురా, అశ్వథ్ధామ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాల విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉంది.

Interview with Mehreen
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News