Friday, April 26, 2024

విభజిస్తుంది, వివక్ష చూపుతుంది

- Advertisement -
- Advertisement -

Sonia-Gandhi

 సిడబ్లూసిలో సిఎఎపై సోనియాగాంధీ నిప్పులు
ఎన్‌పిసి ముసుగులో ఎన్‌ఆర్‌సి
ఆగ్రహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు

న్యూఢిల్లీ: మతపరంగా ప్రజలను విభజించి, వివక్ష చూపడమే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఉద్దేశమని, ఆ చెడు ఆలోచనతోనే ఆ చట్టాన్ని తెచ్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం మండిపడ్డారు. జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సి)కి వేసిన ముసుగే జాతీయ జన గణన పట్టిక (ఎన్‌పిఆర్) అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లూసి) సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్త పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తే అది కలిగించే దారుణమైన హానిని వేలాది మంది యువకులు, మహిళలు ముఖ్యంగా విద్యార్థులు గ్రహించారని ఆమె పేర్కొన్నారు. పోలీసుల ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నా లెక్క చేయకుండా వారు వీధుల్లోకి వచ్చిన ఆందోళన చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు చెప్పారు.

‘సిఎఎ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా జరిగిన సంఘటనలపై ఒక సమగ్రమైన ఉన్నతస్థాయి దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయమని, బాధితులకు న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని ఆమె అన్నారు. ప్రతిరోజూ కేంద్ర హోం మంత్రి, కొన్ని రోజులుగా ప్రధాని మోడీ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. వారు అలాంటి ప్రకటనలు చేయనో రోజు లేదు. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతుంటే ప్రభుత్వం తప్పించుకుంటోంది.

కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అవి పోలీస్ రాష్ట్రాలుగా మారుతున్నాయి’ అని సోనియాగాంధీ విమర్శించారు. దేశ ఆర్థిక పరిస్థితి, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిపై కూడా ఆమె కేంద్రంపై మండిపడ్డారు. సిడబ్లూసి సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అగ్రనాయకులు పి. చిదంబరం, ఆనంద్ శర్మ, ఎకె ఆంటోనీ, కెసి వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు కూడా పాల్గొన్నారు.

CAA discriminatory and divisive law Says Sonia Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News