Monday, May 6, 2024

రైతన్నకు..పెట్టుబడిసాయం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:పంటలు వే సేందుకు రైతన్నలు ఎవరిని ఆశ్రయించకుండా ఉ ండటం.. వడ్డీవ్యాపారుల వద్ద తీసుకొని అధికవడ్డీలు చెల్లించి చితికిపోకుండా ఉండాలనే ప్రధానలక్షంతో ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుబంధు పథకం తీసుకొచ్చారు. వానాకాలం, యాసంగిలో పంట లు వేయడానికి ముందుగానే ప్రభుత్వమే పెట్టుబడి సాయం కింద ఎకరాకు సీజన్‌కు 5వేలు.. ఏ డాదికి 10వేల రూపాయలు నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. 2018 పథ కం ప్రారంభమైన నాటినుండి ప్రభుత్వం సాయం అందిస్తూ వస్తోంది. వానాకాలం 2023లో పదవసారి రైతుబంధును పంపిణీ చేస్తున్నారు. అయితే తొలకరి పులకరించడం.. విత్తనాలు విత్తే సమయ ంలోనే రైతులు వ్యవసాయ ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం వేస్తున్నారు. సోమవారం నుండి రైతుబంధు డబ్బులు రైతుల ఎకౌంట్‌లలో జమచేస్తున్నారు.

తొలిరోజు ఎకరం.. రెండోరోజు రెండకరాల వరకు ఉన్న రై తుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే జమఅవుతున్నాయి. ఈరెండురోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,73,202 మ ంది రైతులకు గాను 287.89 కోట్లరూపాయలు రైతుబంధు కింద జమచేశారు. శరవేగంగా రైతుబ ంధు సాయం అందుతోంది. అయితే బుధవారం మూడెకరాల వరకు పొలం ఉన్న రైతులకు పెట్టుబడి సాయం వారివారి ఎకౌంట్‌లలో వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిరోజూ రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అ వుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సిఎం కేసిఆర్‌ను రైతుబాంధవుడిలా అభివర్ణిస్తున్నారు. ఇదిలాఉంటే రైతులందరికీ పెట్టుబడి సాయం వెనువెంటనే జమచేయడం జరుగుతుందని అధికారులు చెపుతున్నారు. ఉమ్మడినల్లగొండ జిల్లాలో11,25,922 మంది రైతులకుగాను 1241.27 కోట్ల రూపాయలు రైతుబంధు సా యం అందించనున్నారు. రెండురోజుల్లో నల్లగొం డ జిల్లాలోని 2,75,721మందికి 141.16కోట్లు.. సూర్యాపేటజిల్లాలోని 1,61,177మందికి 82. 13కోట్లు.. యాదాద్రిభువనగిరి జిల్లాలోని 1,36, 304 మంది రైతులకు గాను 64.60కోట్ల రూపాయలు రైతుల అకౌంట్‌లలో జమచేశారు.

రైతుబంధు సాయం వడివడిగా రైతులకు అందిస్తున్నా రు. అయితే ఐదెకరాలలోపు రైతులు ఎక్కువ మొ త్తంలోనే ఉన్నారు. ఐదెకరాల కంటే పైనున్న రైతులు తక్కువగా ఉండటంతో విడతలవారీగా అందరికీ సాయం అందనుంది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిం ది. ఇదిలాఉంటే కొత్తగా పాస్‌పుస్తకాలు వచ్చినప్పటికీ రైతుబంధుకు వారి ఖాతాలు జమకాలేదు. అటువంటి రైతుల ఖాతాలు కూడా అప్‌లోడ్ చేశా రు. వీరందరికీ కూడా రైతుబంధు అందనుంది. అంతేకాకుండా పోడుభూముల రైతులకు కూడా పాస్‌పుస్తకాలు ఇచ్చే ప్రక్రియ వేగంగా సాగుతోం ది.

ఈనెలాఖరులోపే వారందరికీ పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నారు. వీరికి కూడా రైతుబంధు అందనుంది. వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే రైతులకు పెట్టుబడి సాయం వడివడిగా వేస్తుండటం.. అందరికి కూడా ఈదఫా శరవేగంగా వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. విత్తనాలు కొనుగోలు చేయడం.. దుక్కులు దున్నేందుకు సిద్ధమైన రైతులకు పెట్టుబడికి సాయం ప్ర భుత్వమే అందిస్తుండటంతో రైతులంతా సీఎం కేసిఆర్‌ను రైతుబాంధవుడిలా అభివర్ణిస్తూ సంతో షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News