Friday, May 3, 2024

బక్రీద్ పండగను ప్రశాంత వాతవరణంలో నిర్వహించుకోవాలి : కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మెదక్ ప్రతినిధిః బక్రీద్ పండగను పకడ్బందీగా, ప్రశాంతవంతమైన వాతవరణంలో నిర్వహించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా కోఆర్డినేషన్ కమిటీ, జిల్లా జంతు హింస నివారణ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండగ నిర్వహణ గోవద నిషేద చట్టం 1977 అమలు, జంతు హింస నివారణ నిమిత్తం చేపట్టనున్న చర్యలపై జిల్లా కలెక్టర్ పలుసూచనలు చేశారు. జిల్లా పోలీసులు బక్రీద్ పండగ సందర్భంగా ప్రతిమున్సిపాలిటీ పరిదిలో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు చెక్‌పోస్టులలో పోలీసులు, పశుసంవర్దకశాఖ సిబ్బంది పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని, పట్టుబడిన పశువులను దగ్గరలోని గోశాలకు తరలించాలన్నారు.

ప్రతి మున్సిపాలిటీ, మేజర్ గ్రామపంచాయతీలలో వెంటవెంటనే పశువుల వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి కుక్కలలో కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేయించుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మెదక్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మెదక్ డిఎస్పీ సైదులు, డిపిఓ, డీఈఓ, డీఎఫ్‌ఓ, మున్సిపల్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News