Saturday, October 5, 2024

భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సిఎం రేవంత్ కి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్ రెడ్డికి ఆలయ పాలక మండలి సభ్యులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు సిఎంకు ఆహ్వాన పత్రిక వారు అందజేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేశస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, హన్మకొండలో జరిగే భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ఆయన కోరారు. అనంతరం సిఎంకు భద్రకాళీ దేవి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సిఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ శేషు, ఈఓ శేషుభారతి సహా ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News