- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా జైపుర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు పంజాబ్ కింగ్స్ 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(28), ఇంగ్లిష్(32) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(53) అర్థశతకంతో రాణించారు. ఇక, చివర్లో మార్కస్ స్టోయినీస్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, 4 సిక్సులతో 44 పరుగులు సాధించాడు. దీంతో పంజాబ్ భారీ స్కోరు సాధించగల్గింది.
- Advertisement -