Monday, April 29, 2024

అఫ్గానిస్థాన్‌పై ఐర్లాండ్ చారిత్రక విజయం

- Advertisement -
- Advertisement -

అబుదాబి: టెస్టు క్రికెట్‌లో ఐర్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ ఆరు వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది. టెస్టుల్లో ఐర్లాండ్‌కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. అఫ్గానిస్థాన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక 111 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక దశలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న ఐర్లాండ్‌ను కెప్టెన్ ఆండ్రూ బల్‌బిర్ని ఆదుకున్నాడు. వికెట్ కీపర్ లొర్కాన్ టక్కర్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించి జట్టుకు చారిత్రం విజయం అందించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బల్‌బిర్నీ 5 ఫోర్లతో 58పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

పాల్ స్టిర్లింగ్(14), టక్కర్ 27 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. ఓపెనర్ పీటర్ మూర్ (0), వన్‌డౌన్‌లో వచ్చిన కుర్టిన్ కంఫేర్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. హారి టెక్టర్ (2) కూడా విఫలమయ్యాడు. అంతకుముందు అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (55), గుర్బాజ్ (46) పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, మెక్ కార్టీ, క్రెగ్ యంగ్ మూడేసి వికెట్లను పడగొట్టారు. కాగా, అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. మార్క్ అడైర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News