Saturday, April 27, 2024

100 మందికి పైగా పాలస్తీనియన్ల హత్యకు సిపిఐ (ఎం) ఖండన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గాజా నగరంలో ఒక ఎయిడ్ ట్రక్‌ను చుట్టూ చేరిన జన సమూహంపై ఇజ్రాయెలీ దళాలు కాల్పులు జరిపి 100 మందికి పైగా పాలస్తీనియన్లను వధించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్) శుక్రవారం ఖండించింది. ఈ అంశంపై మాట్లాడనందుకు భారత ప్రభుత్వాన్ని సిపిఐ (ఎం) విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం ‘యుఎస్ ఏజెంట్’గా వ్యవహరిస్తోందని సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ఆరోపించారు. ‘ఇజ్రాయెలీ మారణకాండ దుర్మార్గాన్ని’ అంతం చేయాలన్న ప్రపంచ దేశాల డిమాండ్‌తో భారత్ ఏకీభవించాలని ఆయన కోరారు. ‘పాలస్తీనియన్లపై దిగ్భ్రాంతికర మారణకాంద. తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఏచూరి ‘ఎక్స్) పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘యుఎస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ తక్షణ కాల్పుల విరమణ డిమాండ్‌పైన మోడీ ప్రభుత్వ మౌనం లక్షం యుఎస్-= ఇజ్రాయెల్= భారత్ కూటమిని పటిష్ఠం చేయడమే.

ఇజ్రాయెల్ మారణకాండను అంతం చేయాలన్న ప్రపంచ దేశాల డిమాండ్‌తో భారత్ ఏకీభవించాలి’ అని ఏచూరి అన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెలీ, హమాస్ గాజా వివాదంపై అమెరికా తీసుకున్న వైఖరిని అనుసరించడాన్ని ప్రభుత్వం మానాలని సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో కోరింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అరబ్ దేశాలు వంటి దేశాల కృషితో ప్రభుత్వం ‘తక్షణం సమన్వయం’ చేసుకోవాలని పొలిట్‌బ్యూరో సూచించింది. గురువారం గాజా నగరంలో ఒక సహాయ వాహనాల సముదాయంలో నుంచి ఆహార ప్యాకెట్లను లాక్కునేందుకు పరుగులు తీస్తున్న పాలస్లీనియన్ల సమూహంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ కాల్పులలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య శాఖ అధికారుల సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మొదటైనప్పటి నుంచి మరణించిన వారి సంఖ్య 30 వేలు దాటింది. మరి 70457 మంది గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News