Tuesday, May 21, 2024

లష్కరే తోయిబాపై నిషేధం ప్రకటించిన ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ముంబయిపై ఉగ్రదాడులు జరిగి 15 సంవత్సరాలు కావస్తోంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. ముంబయిపై జరిగిన దాడులు ప్రాణాంతకమైనవని, ఆ ఉగ్రవాద సంస్థను క్షమించేది లేదని ఇజ్రాయెల్ తెలిపింది.

అయితే భారత సర్కార్ సూచన లేకుండానే ఇజ్రాయెల్ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. లష్కరే సంస్థ గురించి పూర్తి వివరాలు సేకరించిన ఇజ్రాయెల్ ఆ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అయితే ఇదేమీ కొత్త విషయం కాదని 2013నుంచీ ఈ నిషేధం కొనసాగుతోందని, బ్యూరోక్రాటిక్ లోపం కారణంగా ఈ విషయాన్ని మరోసారి ప్రకటించడం జరిగివదని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి లయర్ హయత్ చెప్పారు.

అంతకు ముందు భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. వందల మంది భారతీయ పౌరులహత్యకు ఆ ఉగ్రసంస్థ కారణమని ఇజ్రాయెల్ పేర్కొంది. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు పేర్కొంది. ముంబయి దాడుల్లో ఉగ్వాదులకు బలయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపింది. శాంతియుత భవిష్యత్తుకోసం భారత్‌కు బాసటగా ఉంటామని ఇజ్రాయెల్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News