- Advertisement -
ఇజ్రాయెల్‌లోని జెరూసలెం శివారు లోని అడవుల్లో భీకర కార్చిచ్చు చెలరేగింది. ఆ నగరంలో దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. 24 గంటల్లో వేలాది మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 13 మంది గాయపడ్డారు. అయితే ప్రాణనష్టం ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులు వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అని, జెరూసలెంను రక్షించుకోవడం ప్రస్తుత ప్రాధాన్యం అని పిలుపునిచ్చారు. టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రోడ్డుని మూసివేశారు. బాధితుల సహాయం కోసం సైన్యం కూడా రంగం లోకి దిగింది. ఇప్పటివరకు 23 మందికి చికిత్స జరిగిందని, 13 మంది కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
- Advertisement -