Saturday, October 5, 2024

ఇజ్రాయెల్ మారణకాండ

- Advertisement -
- Advertisement -

274 మంది మృతి.. 700మందికి గాయాలు

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్మంగా లెబనాన్‌లో భీకర వైమానిక దాడులు
మరింతగా విస్తరిస్తామని హెచ్చరిక

జెరూసలెం : లెబనాన్ వ్యాప్తంగా సోమవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకపడింది. ఈ భీకర దాడుల్లో 274 మంది మరణించారు. మరో 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటన లో వెల్లడించింది. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. దక్షిణ, ఈశా న్య లెబనాన్‌లో విస్తృత ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. లెబనాన్‌లో 300 లక్షాలపై బాం బులు వేశామని, హెజ్బొల్లా తీవ్రవాద వర్గంపై ఒ త్తిడి పెంచుతున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ తెలియజేసింది.

సైన్యం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆ దాడుల గురించి ప్రకటన చేసింది. టెల్ అవీవ్‌లో మిలిటరీ ప్రధాన కార్యాలయం నుంచి అదనపు దాడులను మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలెవి ఆమోదిస్తున్న చిత్రాన్ని సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. హెజ్బొల్లాపై సుమారు ఏడాది గా సాగుతున్న పోరులో అత్యంత ఉద్దృతమైన వై మానిక దాడుల్లో దానిని ఒకటిగా పేర్కొన్నారు, రా నున్న రోజుల్లో హెజ్బొల్లాపై కఠిన చర్య తీసుకుంటామని హలెవి, ఇతర ఇజ్రాయెల్ నేతలు వా గ్దానం చేశారు.

సోమవారం ఉదయం నుంచే తమ గ్రామాలు, పట్టణాలను మిగలకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఇజ్రాయెల్ ఈ దుశ్చర్యలకు ఒడి గట్టినట్లు భావిస్తున్నామని లెబనాన్ ప్రభుత్వం మండిపడింది. అయితే ఈ దాడులను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిం చింది. హెజ్‌బొల్లాలు పెద్ద ఎత్తున ఆయుధాలను ని ల్వ చేసిన ఆవాసాలను, ప్రాంతాలను వీడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. దీంతో వేలాది వాహనాల్లో ప్రజలు బారులు తీరా రు. లెబనాన్ మరో గాజాలా మారుతోందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News