Tuesday, October 15, 2024

గాజా స్కూల్‌పై ఇజ్రాయిల్ దాడి

- Advertisement -
- Advertisement -

11 మంది మృతి

దెయిర్ అల్ బలాహ్ (గాజా స్ట్రిప్) : ఉత్తర గాజాలో వేలాది మంది నిర్వాసిత పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఒక పాఠశాలపై గురువారం ఇజ్రాయిల్ వైమానిక దాడిలో కనీసం 11 మంది వ్యక్తులు మరణించనట్లు, మహిళలు, పిల్లలతో సహా 22 మంది గాయపడినట్లు ఆ ప్రాంత ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. జబలియా సైనిక శిబిరంలోని పాఠశాలపై తాము దాడి జరిపినట్లు ఇజ్రేలీ మిలిటరీ ధ్రువీకరించింది. ఇజ్రేలీ దళాలను లక్షం చేసుకోవాలని యోచిస్తున్న ఆ పాఠశాలలోని హమాస్ తీవ్రవాదులను తాము లక్షం చేసుకుంటున్నట్లు మిలిటరీ తెలియజేసింది. విస్తృత స్థాయిలో శిథిలాలు, జన సమూహం మధ్య పాఠశాల ఆవరణలో నుంచి మృతదేహాలను సహాయ కార్యకర్తలు తరలిస్తుండడం అల్ ఫలౌజా స్కూల్ ఫుటేజ్‌లో కనిపించింది.

కాగా, మృతుల్లో మహిళలు, పిల్లలు ఎందరు ఉన్నారో గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెంటనే తెలియజేయలేదు. దాడులకు వ్యూహ రచన కోసం ‘కమాండ్ కేంద్రాలుగా’ హమాస్ యోధులు ఉపయోగించుకుంటున్న పాఠశాలపై తాము దాడులు జరుపుతున్నట్లు ఇజ్రేలీ దళాలు తెలియజేశాయి, పౌర మృతులను నివారించేందుక తాము నిర్దిష్ట ఆయుధాలు ఉపయోగిస్తున్నట్లు మిలిటరీ తెలియజేసింది. దక్షిణ ప్రాంత నగరం ఖాన్ యూనిస్‌లో ఇజ్రేల్ ఒక రోజు ముందు గాజా స్ట్రిప్‌కు తీసుకువచ్చిన 88 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను అధికారులు సామూహికంగా ఖననం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News