Tuesday, December 6, 2022

తెలంగాణలో ఐటి, ఇడి తనిఖీల కలకలం

- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణలో ఐటి, ఇడి తనిఖీలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్‌తో సహా గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం కూడా మంత్రి గంగుల నివాసంలో ఇడి సోదాలు చేపట్టింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో దాడులు నిర్వహించారు. ఇడి విచారణకు పూర్తిగా సహకరిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఇడి, ఐటి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Latest Articles