Monday, April 29, 2024

ఉత్తమ ఐటి మంత్రిగా కెటిఆర్‌కు స్కోచ్ అవార్డు

- Advertisement -
- Advertisement -

IT Minister KTR has been awarded the SKOCH

 

ఇ-గవర్నెన్స్ ఇనిషియేటివ్‌లతో ప్రత్యేక నిరూపించుకున్న స్టేట్ ఆఫ్ ది ఇయర్ తెలంగాణ
కరోనా కాలంలో ఐటి సేవలను విస్తృతంగావినియోగించినందుకు అభినందనలు
2016లో ఒకసారి ఇప్పుడు రెండు అవార్డులు పొందినందుకు రాష్ట్రాన్ని ప్రశంసిస్తూ స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్‌కొచ్చర్ సందేశం

హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలోనే ఉత్తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఆయనర్ నిలిచారు. ఈ మేరకు స్కోచ్ గ్రూప్ మంత్రి కెటిఆర్‌కు ప్రశంసాపత్రం అందించింది. 2020 సంవత్సరంలో తన సేవలతో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను బెస్ట్ ఫర్ ఫార్మింగ్ ఐటి మినిష్టర్‌గా ఆయనను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు ప్రకటించింది. అలాగే పలు ఇన్నోవేటిక్, ఈ గవర్నెన్స్ ఇన్షియేటివ్‌లతో ప్రత్యేకత చాటిన తెలంగాణ రాష్ట్రాన్ని ’స్టేట్ ఆఫ్ ది ఇయర్’కు ఎంపిక చేసింది.

దేశంలోనే ఐటి శాఖలోనే అత్యుత్తమంగా సేవలందిస్తున్న కెటిఆర్‌కు ఈ అవార్డు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ మంత్రి కెటిఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు ఐటి సేవలను అందించడం కొనసాగించాలని చెప్పారు. కరోనా కాలంలో ఐటి సేవలను విస్తృతంగా వినియోగించారని ఈ సందర్భంగా సమీర్ కొచ్చర్ అభినందించారు. 2016లో ఒకసారి మళ్లీ ఇప్పుడు రెండుసార్లు అవార్డు పొందడం అభినందనీయమని కెటిఆర్‌కు సందేశం పంపించారు. కాగా ఈ గవర్నెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన అవార్డును మంత్రి కెటిఆర్‌కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అందజేస్తూ, రాష్ట్రానికి ఈ రెండు అవార్డులు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News