Wednesday, May 21, 2025

ఆర్టిసి సమ్మెకు అనుకూల పరిస్థితులు లేవు: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్టిసి కార్మికులు సమ్మె విషయాన్ని పునరాలోచించాలని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఆర్టిసి సమస్యలు పరిష్కారానికి పూర్తిగా అనుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సమ్మెకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేవని ఆయన తెలిపారు. రాష్ట్ర సాధనలో ఆర్టిసి కార్మికులు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆర్టిసి కార్మికులు సంక్షేమం, ప్రయాణికులు సౌకర్యం, సంస్థ పరిరక్షణ వంటి అంశాలకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకూ కార్మికులు తనని కలవలేదని అన్నారు. నేరుగా లేబర్ కమిషన్‌ను కలిసి నోటీసులు ఇచ్చారన్నారు. గత పదేళ్లుగా ఆర్టిసి అభివృద్ధిలో నిలకడ లేదని, తమ ప్రభుత్వం వచ్చాక అన్ని బకాయిలను విడుదల చేస్తోందని వివరించారు. ఆర్టిసి ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోందని, సంస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోదని అన్నారు. ఈ నేపథ్యంలో, కార్మికులు ఆత్మపరిశీలన చేసుకొని సమ్మె నిర్ణయంపై పునరాలోచించాలని మంత్రి కో్రారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News