Wednesday, April 17, 2024

జమిలికి జై

- Advertisement -
- Advertisement -

కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు

న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. గురువారం ఉదయం కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్ట్రపతిభవన్‌కు వెళ్లారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదిక ను సమరించారు. దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయ పడింది. ఏకకాలంలో ఓటు వేయడం దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో దోహదపడుతుందని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్ర క్రియను , సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది. ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ అభిప్రాయపడింది.
కమిటీ సూచనలు
జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. మొదట లోక్‌సభ, రాష్ట్రాల శాస న సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నివేదికలో తెలిపింది. ఒక వేళ హంగ్ సభ, లేదా అవిశ్వాస తీర్మానం కారణంగా లోక్‌సభ రద్దయిన పక్షం లో కొత్త లోక్‌సభను ఏర్పాటు చేయడానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది ఒక వేళ లోక్‌సభకు తాజా ఎన్నికలు నిర్వహిస్తే ఆ స భ గడువు అంతకు ముందు లోక్‌సభ పూర్తి గడువు ముగిసే దాకా ఉంటుందని కమిటీ పేర్కొంది. అలాగే ఒక వేళ రాష్ట్రాల అసెంబ్లీలకు తాజా ఎన్నికలు నిర్వహించినట్లయితే ఆ సభల గడువు లోక్‌సభ పూర్తి టర్మ్ ముగిసేదాకా ఉంటుందని కూడా కమిటీ స్పష్టం చే సింది. ఇందుకోసం రాజ్యాంగంలోని కనీసం అయి దు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ సూచించింది. వాటిలో పార్లమెంటు సభల గడువుకు సంబంధించిన ఆర్టికల్ 82, రాష్ట్రాల శాసనసభల గడువుకు సంబంధించిన ఆర్టికల్ 172 ఉన్నాయి. అయితే ఈ రాజ్యాం గ సవరణలకు రాష్ట్రాల ఆమోదం పొందాల్సిన అవసరం ఉండదని కూడా కమిటీ తెలిపింది. ఇక మూడు స్థాయిల ఉమ్మడి ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబి తా ఉండాలని, ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలని తెలిపింది. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ఆర్టికల్ 325ను కూడా దీనికి అనుగుణంగా సవరించాలని కమిటీ సూచించింది.
సమర్థించిన 32 పార్టీలు
దాదాపు 190 రోజుల పాటు కమిటీ ఈ అంశంపై అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించింది. రాజకీ య పార్టీల అభిప్రాయాలను కూడా కోరింది.47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేశాయి. వీటిలో 32 పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్థించగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమా జ్ పారీ,్ట సిపిఎం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా, బిజెపి, నేషనల్ పీపుల్స్ పార్టీ సమర్థించాయి. ఇక ప్రాంతీయ పార్టీల్లో ఎఐయుడిఎఫ్, తృణమూల్ కాం గ్రెస్, ఎఐ ఎంఐఎం, సిపిఐ, డిఎంకె, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాది పార్టీ జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను వ్యతిరేకించాయి, అన్నాడిఎంకె, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అప్నాదళ్ (సోనేలాల్), అసోం గణపరిషత్. బిజూ జనతాదళ్, లోక్‌జనశక్తి పార్టీ(ఆర్), శివసేన, జనతాదళ్( యునైటెడ్), శిరోమణి అకాలీదళ్, తదితర పార్టీలు వ్యతిరేకించాయి. కాగా బిఆర్‌ఎస్, తెలుగు దేశం పా ర్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాయ జనతా దళ్ ఎన్‌సిపి, జార్ఖండ్ ముక్తిమోర్చాలాంటి మరి కొన్ని పార్టీలు దీనిపై స్పందించలేదు. కాగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించిన వారిలో ముగ్గురు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్‌లు, ఒక రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఉన్నారని కమిటీ తెలిపింది. అ యితే కమిటీ సంప్రదించిన నలుగురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ శరద్ అరవింద్ బో బ్డే, జస్టిస్ యుయు లలిత్‌లు అందరూ కూడా జమిలి ఎన్నికలను సమర్థిస్తూ లిఖితపూర్వక సమాధానాలు తెలియజేశారని కూడా కమిటీ పేర్కొంది. మరోవైపు నివేదిక సమర్పించడానికి ముందు కమిటీ దక్షిణాఫ్రి కా, స్వీడన్, బెల్జియంలాంటి ఆరు దేశాల్లో జరుగుతు న్న జమిలి ఎన్నికల ప్రక్రియను కూడా అధ్యయనం చేసింది. ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొంత కాలంగా బలంగా ప్రచారం చేస్తున్న మోడీ సర్కార్ 2023 సెప్టెంబర్‌లో దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సం ఘం మాజీ చైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజ య్ కొఠారిలను కమిటీలో సభ్యులుగా చేర్చింది.
ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్రప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలను అ ప్పగించింది. మరోవైపు ‘ ఒకే దేశంఒకే ఎన్నిక’ అం శంపై లా కమిషన్ కూడా తన నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగం లో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉందని సమాచారం. 2029 నాటికి ఏకకాల ఎన్నికల నిర్వహణ వీలయ్యేలా చేసేందుకు అవసరమైన గైడ్‌లైన్స్‌ను లా కమిన్ ప్రభుత్వానికి అందజేయవచ్చని కూడా తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News