Friday, September 19, 2025

జపాన్ దౌత్య కార్యాలయం పై రాళ్ల దాడి..

- Advertisement -
- Advertisement -

టోక్యో : అణుజలాలను పసిఫిక్ మహా సముద్రం లోకి తాము విడుదల చేయడం ప్రారంభించిన తరువాత చైనా లోని తమ జపాన్ దౌత్యకార్యాలయాలపైన, పాఠశాలల పైన రాళ్ల దాడి సంఘటనలు జరుగుతున్నాయని చైనాపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ధ్వజమెత్తారు. చైనా లోని జపాన్ వ్యాపార సంస్థలు బేకరీలు నుంచి అక్వారియంల వరకు అనేక వేల బెదిరింపు కాల్స్ చైనా సభ్యుల నుంచి వస్తున్నాయని విమర్శించారు. దీనిపై జపాన్ లోని చైనా రాయబారికి సోమవారం సమన్లు పంపామని, చైనా ప్రజలు ప్రశాంతంగా, బాధ్యతా యుతంగా ప్రవర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. చైనా లోని తమ దౌత్య సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామని జపాన్ ప్రకటించిన తరువాత ఈ వ్యాఖ్యలు వచ్చాయని జపాన్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News