Saturday, April 27, 2024

ఈనెల 10న నిరుద్యోగులకు జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

job-fair

 

హైదరాబాద్ : నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పించుటకు ఈనెల 10వతేదీన మినీబాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ యూఈఐ డిప్యూటీ చీఫ్ అధికారి అనంతరెడ్డి తెలిపారు. మంగళవారం వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ అపోలా ఫార్మసీ,కాలిబ్ హెచ్ ఆర్,బయో కేర్ మెడికల్ సిస్టిమ్స్, హిందూజా గ్లోబల్ ప్రైవేటే లిమిటెడ్, వేగాయరియాస్ సోలూష్యన్స్,ఐడిబిఐ ఫెడరల్, సన్‌ప్లవర్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్స్, పేటిఎం, ఏజిఐ గ్లాస్ వంటి కంపెనీల్లో పనిచేయుటకు అర్హులైన 1000 అభ్యర్ధులు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

మేళాకు హాజరయ్యే అభ్యర్దులు పదవతరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బిటెక్, పిజి, ఎంబిఏ,భిపార్మసీ,డిఫార్మసీ చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఫార్మ అసిస్టింట్, టెలికాలర్స్, కస్టమర్స్ సర్వీసు రిప్రసెంటేటివ్, సేల్స్ ట్రేనిస్, ప్రమోటర్స్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రిషియన్ మొదలగు ఉద్యోగాల్లో పనిచేయాల్సి వస్తుందన్నారు.

వీరికి నెలకు వేతనం రూ. 10వేల నుండి రూ. 20వేలవరకు ఇవ్వనున్నట్లు చెప్పారు. అభ్యర్దుల వయస్సు 19సంవత్సరాల నుండి 35సంవత్సరాల పురుషులు, స్త్రీలు అర్హులన్ని,ఆసక్తి గల అభ్యర్ధులు నిరుద్యోగ యువకులు తమ బయోడేటా పాటు విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాఫీలతో జవవరి 10 శుక్రవారం ఏఆర్‌కె ట్రైనింగ్ సొల్యూషన్స్, జాహ్నవిహోటల్ మేనేజెంట్ కళాశాల్లో లోయర్‌ట్యాంక్‌బండ్ కవాడిగూడలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

 

Job fair for the unemployed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News