Saturday, April 27, 2024

డెల్ కంపెనీలో ఉద్యోగం.. కానీ జల్సాలకు అలవాటుపడి చోరీలు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ రాబరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.9,50,000 స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐసిసిసిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, గోపాలపురానికి చెందిన పటేల్ మోతిరామ్‌యాదవ్ డెల్ కంపెనీలో కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు నేరాలు చేయడం ప్రారంభించాడు. ఈ నెల 12వ తేదీన జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 52లో ఉన్న ఇంటికి ఉదయం ప్రవేశించాడు. ఆ సమయంలో బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న ప్రెగ్నెంట్ నవ్య గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు.

ఇంట్లోని అందరి మొబైల్ ఫోన్లు తీసుకుని ఫ్లైట్ మోడ్‌లో పెట్టాడు. వెంటనే తనకు రూ. 20లక్షలు అరేంజ్ చేయాలని ఆదేశించాడు, లేకుండా నవ్యను చంపివేస్తానని బెదిరించాడు. బాధితులు ఇంట్లో డబ్బులు తెలిసిన వారి వద్ద అడిగి రూ.10లక్షలు ఇచ్చారు. వాటిని తీసుకున్న నిందితుడు బాధితులతోనే షాద్‌నగర్ వరకు క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి పరారయ్యా డు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో నిందితుడి కోసం గాలింపు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News