Thursday, April 25, 2024

క్షిపణితో లేపేస్తా.. జాన్సన్‌కు పుతిన్ బెదిరింపు

- Advertisement -
- Advertisement -

లండన్ : తనను ఏకంగా క్షిపణి దాడితో తుదముట్టిస్తానని రష్యా అధ్యక్షులు పుతిన్ ఓ దశలో బెదిరించాడని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడులకు సన్నాహాల దశలో పుతిన్ నుంచి తనకు ఫోన్ వచ్చిన విషయాన్ని ఈ మాజీ ప్రధాని ఇప్పుడు ప్రస్తావించారు. తమాషాలు చేయవద్దు, క్షిపణి దాడి చేస్తే పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అంటూ పుతిన్ తనను ఫోన్‌లో హెచ్చరించినట్లు వివరించారు. బిబిసి డాక్యుమెంటరీ పుతిన్ వర్సెస్ వెస్ట్‌లో వీరిరువురి సంభాషణల వివరాలను పొందుపర్చారు.

ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం దశలో ఈ ఇరువురు నేతల మధ్య మాటామాట పెరిగింది. దాడులకు దిగితే అది ఉపద్రవానికి దారితీయడం , పైగా పశ్చిమ దేశాల నుంచి తీవ్ర ఆంక్షలతో రష్యా ఏకాకి కావడం జరుగుతుందని పుతిన్‌ను హెచ్చరించిన దశలో పుతిన్ రెచ్చిపోయి అయితే క్షిపణి దాడికి సిద్ధంగా ఉండూ , క్షణంలో దెబ్బతింటావని చెపుతూ పుతిన్ ఫోన్ కట్ చేసినట్లు డాక్యుమెంటరీలో పొందుపర్చారు. దీనిని నిర్థారించిన జాన్సన్, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే సరిహద్దులలోకి భారీగా నాటో దళాలు చేరుకుంటాయని తాను హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News