Thursday, June 13, 2024

ఓటు వేసిన సినీ ప్రముఖులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జూబ్లిహిల్స్‌లోని పీ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఓటు వేశారు.

సినీ హీరో వెంకటేశ్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో భార్య సురేఖతో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి ఓటు వేశారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌ 153లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఓటు ఓటు వేశారు. దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, తేజ, హీరో నితిన్‌‌, శ్రీకాంత్‌ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News