Thursday, May 2, 2024

కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ

- Advertisement -
- Advertisement -

రౌస్ అవెన్యూ కోర్టులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగబో తోంది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బడేజా ఈ పిటిషన్‌ను విచారించబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మార్చి 26న మధ్యంతర బెయిల్ కోసం కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన చిన్న కుమారుడు పరీక్షలు ఉన్నందువల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయి ల్ ఇవ్వాలంటూ కవిత కోరారు. కవితకు బెయిల్ మంజూరుపై ఇప్పటికే ఇడిని రౌస్ అవెన్యూ కోర్టు వివరణ కోరింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని ఇడి కోరే అవకాశం ఉంది.

కవిత బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఇడి భావిస్తోంది. మరో వైపు కవితకు జైల్లో సదుపాయాల కల్పనపైనా కోర్టు విచారణ జరపబోతోంది. ఎంఎల్‌సి కవితకు సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితకు ఇంటిభోజనం, పడుకోవడానికి మంచం, పరుపులు, చెప్పులు, దుప్పట్లు, బట్టలు, పుస్త కాలు, పెన్ను పేపర్లు, మందులు తీసుకువెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కానీ తీహార్ జైలు అధికారులు అవేవీ అమలు చేయ లేదు. దీనిపై మరోసారి కవిత కోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News