Monday, November 11, 2024

60 రోజుల్లో సమగ్ర కులగణన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తం గా ఇంటింటికి తిరిగి సమగ్ర కుటుంబ సర్వే చే పట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్వే చేపట్టే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. బిసి, ఎస్సీ, ఎ స్టీ, ఇతర బలహీన వర్గాల కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య అంశాలపై సర్వే చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఉద్యోగ, రాజకీ య, కుల అంశాలపై ప్రధానంగా ఈ సర్వే చే యనున్నట్లు సీఎస్ వెల్లడించారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు. ప్ర ణాళిక శాఖను ఈ సర్వే చేసేందుకు నోడల్ డి పార్టుమెంట్‌గా ప్రభుత్వం పేర్కొంది.సిఎం రే వంత్‌రెడ్డిని బిసి సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బిసి ప్రతినిధుల బృందం కలిసిన 24 గంటల్లో నే సమగ్ర కులగణన చేపట్టాలని ప్రభుత్వం జి వో 18 జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర కులగణను ప్రణాళిక శాఖ ద్వా రా 60 రోజుల్లో చేపట్టాలని జీవోలో స్పష్టంగా పేర్కొంది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తాము స్వాగతిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమస్త బీసీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక కులగణనపై ఎవరు రాజకీయ కుట్రలు చేయకుండా కులగణను సాఫీగా జరిగేలా సహకరించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు, రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, మేధావులకు ఆయన విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమగ్ర కులగణనకు జీవో విడుదల చేయడం బీసీలకు దసరా కానుకగా బావిస్తున్నామని జాజుల ఆనందం వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ వన్ మేన్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమిమ్ అక్తర్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వన్ మేన్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమిమ్ అక్తర్‌ను ప్రభుత్వం నియమించింది. 2023 లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా శమిమ్ ఆక్తర్ రిటైరయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News