Wednesday, August 20, 2025

రేగొండ నూతన ఎస్‌ఐగా కె రాజేష్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/రేగొండః రేగొండ మండల నూతన ఎస్‌ఐగా కె రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకుముందు రామగుండం కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. రేగొండ ఎస్‌ఐగా ఉన్న ఎన్ సందీప్ కుమార్ భూపాలపల్లి విఆర్‌కు బదిలీ అయాయరు. ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐ కె రాజేష్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికి అందుబాటులో ఉంటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News