Saturday, June 15, 2024

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్

రేగొండ: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలుస్తుందని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అంకం రాజేందర్ అన్నారు. భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశానుసారం గురువారం ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు రేగొండ మండల బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు గురువారం ఇంటింటి సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు అంకం రాజేందర్ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి, పేదల పెన్నిధి, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడుతున్న ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో అంకం రాజేందర్, కాకర్లపల్లి సర్పంచ్ కుసుంబ రంజిత్, పొనగండ్ల సర్పంచ్ గంపల సుమలత భాస్కర్, గ్రామ కమిటీ అధ్యక్షులు గుర్రం తిరుపతి, మండల ఉపాధ్యక్షులు గంపల లింగయ్య, ఉప సర్పంచ్ మద్ది కుమారస్వామి, నల్ల ప్రతాప్‌రెడ్డి, వేములపల్లి రాజు, మహ్మద్ నసీరోద్దీన్, ఎనమల్ల సంజీవ, గుర్రం తిరుపతి, గుర్రం వెంకటేష్, ఓదెల సుభాష్, కాగితపు సదానందం, మొగిలి, బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్ దాట్ల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News