Tuesday, October 15, 2024

ఎమర్జెన్సీ విడుదల వాయిదా.. రిలీజు తేదీ చెపుతానన్న కంగన

- Advertisement -
- Advertisement -

ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తానని నటి, ఎంపి కంగనా రనౌత్ తెలిపారు. అత్యంత వివాదాస్పదం అయిన ఈ సినిమా శుక్రవారం విడుదల కావల్సి ఉంది. అయితే విడుదల వాయిదా పడిందని శుక్రవారం ఆమె వెల్లడించారు. ఈ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషించారు. దేశంలో ఎమర్జెన్సీ విధింపు ఇతివృత్తం తీసుకుని రూపొందించిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం కూడా కంగనానే . ఇప్పటికీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి దక్కలేదు. సినిమా విడుదల నిలిపివేతకు హైకోర్టులలో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

సినిమాలో అత్యంత సున్నిత మతపరమైన విషయాల ప్రస్తావన ఉందని , తాము తీవ్రంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోం శాఖ ఇటీవల తెలిపింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని బాధతప్త హృదయంతో చెపుతున్నానని , విడుదల వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నామని కంగనా శుక్రవారం తెలిపారు. పరిణామాలను అంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు , ఈ సినిమాకు ఓపిగ్గా ఎదురుచూస్తున్న వారందరికి ధన్యవాదాలని ఈ సంచలనాల బిజెపి ఎంపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News