Saturday, April 27, 2024

కాన్పూర్ మేయర్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Kanpur Mayor In Trouble Over Pic

కాన్పూర్: కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే పోలింగ్ బూత్ లోపల ఫోటోలు, వీడియోలు తీసి వివాదంలో చిక్కుకున్నారు. యుపి అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో పాండే ఓటు వేసేటప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఫోటోను షేర్ చేశారు. పాండే కాన్పూర్‌లోని హడ్సన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో తన ఓటు వేశారు. ఆమె ఓటు వేస్తున్నప్పుడు వీడియోను చిత్రీకరించింది. అంతటితో ఆగకుండా అనేక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా మేజిస్ట్రేట్ ఆమెపై చర్యలు తీసుకున్నారు. “హడ్సన్ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ గోప్యతను ఉల్లంఘించినందుకు సంబంధిత సెక్షన్ల కింద శ్రీమతి ప్రమీలా పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతోంది” అని కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఏడు రౌండ్లలో ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది మూడో దశ. ఈ ఎన్నికల్లో 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2.15 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News