Monday, October 14, 2024

ఖమ్మంలో ఢీకొన్న రెండు బైకులు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాగ్యనగర్ ఆంజనేయ స్వామి దేవాలయం బొడ్రాస్ కుంట వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గుంపుకు చెందిన ఉండం సూర్యనారాయణ (55), ఉండం సుగుణ(45) అనే దంపతులు ఇల్లందు నుండి టూ వీలర్ పై కారేపల్లి వైపు వస్తుండగా, ఆలియా తండా గ్రామానికి చెందిన డీజే రాజు, సోలార్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఆంధ్ర ఇంజనీర్ కారేపల్లి వైపు నుండి ఇల్లందు వెళ్తుండగా బొడ్రాస్ కుంట వద్ద ఎదురెదురుగా రెండు టూ వీలర్లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. డిజె రాజు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఉండం సూర్యనారాయణ,  ఉండం సుగణ, ఆంధ్ర ఇంజనీర్ వెంకటేష్(36 ‌)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News