Wednesday, February 21, 2024

తెలంగాణలో రెండో నగరంగా కరీంనగర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: సిఎం కెసిఆర్,మంత్రి కెటిఆర్ సహాకారంతో తెలంగాణ లో రెండో నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దుతామని ,కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కొత్తపల్లి మండలంలోని రేకుర్తిలోని 18వ డివిజన్‌లోని వెంకటేశ్వర కాలనీలో 1 కోటి 90 లక్షలతో పలు అభివృద్ధి పనులను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, 18వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్‌లతో కలిసి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

డివిజన్ అభివృద్ధి కి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్,మంత్రి కెటిఆర్ సహాకారంతో తెలంగాణలో కరీంనగర్‌ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.నగరపాలక సంస్థలో విలీనం అయిన డివిజన్‌ల అభివృద్ధి కి కృషి చేస్తున్నామని, రేకుర్తి గ్రామ పంచాయితీగా వున్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని. రేకుర్తి 18,19 డివిజన్ల అభివృద్ధి కి అత్యధికంగా నిధులు కేటాయించామని అన్నారు.

పనులు పురోగతి లో ఉన్నాయని అన్నారు.ప్రారంభించిన పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.రోడ్లు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.కరీంనగర్ అభివృద్ధి కి ప్రజలు సహకరించాలని అన్నారు.గత 50ఏళ్లలో జరుగని అభివృద్ది ఈ 9యేళ్లలో అభివృద్ది చేసామని,దేశంలో తెలంగాణ ఒక రోల్‌మాడల్‌గా సిఎం కెసిఆర్ సారధ్యంలో తీర్చిదిద్దుతున్నామని,కరీంనగర్‌ను తెలంగాణలో రెండవ నగరంలో తీర్చిదిద్దుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలోకార్పొరేటర్లు సుధ గోని మాధవి కృష్ణ గౌడ్ ,ఏదుల్ల రాజశేఖర్ , వి.రాజేందర్ రావు,భూమా గౌడ్, జంగిలి సాగర్ దీండిగాల మహేష్ , గుగ్గిళ్ల శ్రీనివాస్, తుల బాలయ్య ,బారసా నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీద్, నరేష్ డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News